మంచిర్యాల : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ *ధరణి మధుకర్ శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ-3 గని ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల నగరం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సింగరేణి సంస్థ పురోగతితో పాటు గనుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్ముల నరేష్, ఐఎన్టీయూసీ మంచిర్యాల అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దసరా నవరాత్రుల సందర్భంగా గని ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొనగా, ప్రముఖులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని, సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.










