లక్షెట్టిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

0
3

లక్షెట్టిపేట: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట పట్టణ, రూరల్, హాజీపూర్ మండలాల బతుకమ్మ సంబురాలు, కార్యకర్తల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తన సతీమణి స్రవంతితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా స్రవంతి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రజలందరికీ బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని స్రవంతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణ, రూరల్, హాజీపూర్ మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు