ఆసిఫాబాద్ ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని మోతుగూడ గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించారు.
ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బి. గోపాల్, ఉప సర్పంచ్ చింతల పవన్ కుమార్, మరియు వార్డ్ సభ్యులు విక్రమ్, శ్రీకాంత్, రాజేందర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు సప్త శ్రీనివాస్, బి. అశోక్, బి. రమేష్, నరేష్ తదితరులు హాజరై బతుకమ్మ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గ్రామ ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాంప్రదాయ నృత్యాలు మరియు పాటలతో మోతుగూడ గ్రామంలో పండగ వాతావరణాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.










