11వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నెయ్యాల రీట నామినేషన్

0
1

 * వార్డు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి

 * భారీగా తరలివచ్చిన మద్దతుదారులు, వార్డు ప్రజలు

పలాస: స్థానిక ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు నుండి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా చించాన మను సతీమణి నెయ్యాల రీట తన నామినేషన్ దాఖలు చేశారు. వార్డులోని పెద్దలు, మహిళలు, యువత మరియు తన మద్దతుదారులతో కలిసి ఉత్సాహంగా తరలివెళ్లిన ఆమె, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నెయ్యాల రీట మీడియాతో మాట్లాడుతూ.. 11వ వార్డు ప్రజల ఆశీస్సులతో, స్థానికుల ప్రోత్సాహంతోనే తాను ప్రజాసేవ చేసేందుకు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. వార్డులో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని, గెలిచిన వెంటనే త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.

రాజకీయాలకు అతీతంగా, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో 11వ వార్డు ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త చించాన మను, వార్డు ప్రముఖులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.