పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున బెల్లాల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే వార్డుకు కౌన్సిలర్గా సేవలందించిన ఆయన, ఈసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు.
నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వార్డులోని ఓటర్లందరూ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కౌన్సిలర్గా ఉన్న కాలంలో వార్డు అభివృద్ధికి తాను చేసిన సేవలు, చేపట్టిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పలాసకు చెందిన పి వీ సతీష్ సతీమణి తాళాసు శ్రీపద్మ పోటీ చేస్తున్నారని, ఆమెకు కూడా అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.










