Madanapalle: మదనపల్లె రాజ్ భవన్ లాడ్జిలో భార్య రుబియా తాజ్‌ను హత్య చేసిన నిందితుడు నవీద్ పాషను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

0
3

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని బిసెంట్ రోడ్డులో ఉన్న రాజ్ భవన్ లాడ్జిలో ఈనెల 15న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు నవీద్ పాష అలియాస్ గంజా నవీద్ (30)ను మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్‌కు చెందిన నవీద్ పాష తన భార్య రుబియా తాజ్‌ను రామసముద్రంలోని ఆమె తల్లి ఇంటి నుంచి మదనపల్లెకు తీసుకొచ్చి, లాడ్జిలో హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. హత్య అనంతరం బెంగళూరుకు పారిపోయిన నిందితుడు తిరిగి మదనపల్లెకు వస్తుండగా నక్కలదిన్నె ఆర్చ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.