మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు జనరల్ మహిళకు కేటాయించడంతో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేగడి జోష్ణప్రియ మదనపల్లె దొంతి వీధిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సోదరుడు, ఆల్ ఇండియా కాపు, బలిజ, తెలగ, ఒంటరి రాయలసీమ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు మద్దతుగా నిలిచి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా జోష్ణప్రియ మాట్లాడుతూ.. 30వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని వార్డు ప్రజలను కోరారు.










