గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి చొరవతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు..!
ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చొరవతో రూ.60 లక్షలకు పైగా అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ సదుపాయాన్ని కల్పించడం జరిగింది.
గతంలో సరైన రహదారులు లేక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో బురద రోడ్లపై నడవలేక, జారిపడి గాయాలపాలవుతూ, పశువులు, ఎడ్లబండ్లు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడేవారు. నిత్యజీవితంలో ఎదురవుతున్న ఈ సమస్యలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంతో పరిష్కారం లభిస్తుండటంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి పెద్దిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తోందని, ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలే ప్రాధాన్యం..!










