వరికుంటపాడు మండల కేంద్రంలో బిగ్ టీవీ రిపోర్టర్ తాళ్లూరి చిన్నయ్య గారి కుమార్తె చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారి తనిష్కకు అక్షింతలు వేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చిన్నారి జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం తాళ్లూరి చిన్నయ్య గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం, ఐశ్వర్యం, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.










