ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కలిసిన 7వ బెటాలియన్ కమాండెంట్ బి. సీతారాం🚩

0
1

▫️నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వక భేటీ

▫️బెటాలియన్ అభివృద్ధి, పరిపాలన, వసతుల కల్పనపై చర్చ

▫️పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

🔸నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లి కేంద్రంగా గల 7వ బెటాలియన్ కమాండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. సీతారాం ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో భాగంగా కమాండెంట్ సీతారాం పూల మొక్కను అందజేసి పరిచయం చేసుకున్నారు.

🔸ఈ సందర్భంగా బెటాలియన్‌లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులు, పరిపాలనాపరమైన అంశాలు, పెండింగ్ బిల్లులు, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు.

🔸బెటాలియన్ అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించి, కమాండెంట్‌గా అంకితభావంతో విధులు నిర్వహించాలని బి. సీతారాంకు ఎమ్మెల్యే సూచించారు.🔸అనంతరం ఈ నెల 21న 7వ బెటాలియన్‌లో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యేను కమాండెంట్ సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాస్, ఆర్‌ఐలు త్రిముఖ్, నవనీత్, ఏఆర్ ఎస్‌ఐ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.