నిజామాబాద్‌లో వడ్డీ వ్యాపారులపై పోలీసుల భారీ దాడులు!

0
3

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

🔎 పోలీసుల సమాచారం ప్రకారం, మొత్తం 67 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

⚠️ అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని వేధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.

📢 అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురవుతున్న బాధితులు ఎలాంటి భయం లేకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.