ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి – ఏవో బండి ప్రకాష్

0
2

పెద్దపల్లి, అక్టోబర్ 19: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.