ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
2

 

 

ఎమ్మిగనూరులోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు బనవాసి బసిరెడ్డి గారితో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ టౌన్ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం హాస్యాస్పదమన్నారు.

వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులకు శ్రీరామరక్ష అని, ప్రజా సంక్షేమమే తమ అజెండా అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ సి పి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.