పాత పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రజక బజార్లో అమ్మవారి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ శ్రీలత, 38వ వార్డు కార్పొరేటర్ బత్తుల మధుచంద్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.








