విజయదశమి వేళ ఆయుధ పూజ…వాహన పూజ.|

0
3

 

● ప్రజా రక్షణే పోలీసుల ధ్యేయం.. ప్రజా సేవే సంకల్పం

● శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వహించాలి

అల్వాల్, అక్టోబర్ 19: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించడం మన సంప్రదాయమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పేర్కొన్నారు.

ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాలు కేవలం విధి నిర్వహణ సాధనాలు మాత్రమే కాకుండా ప్రజల భద్రతకు ప్రతీకలని తెలిపారు. విజయదశమి శుభసందర్భంగా ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు నిర్వహిస్తూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం అంకితభావంతో విధులు నిర్వహించాలని సంకల్పిద్దామని పేర్కొన్నారు.

“ప్రజా రక్షణే మా ధ్యేయం – ప్రజా సేవే మా సంకల్పం” అనే ఆశయంతో ప్రజలకు నిరంతరం సేవలందించాలని పిలుపునిచ్చారు. 

ఈ విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు, వారి కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

#Sidhumaroju

Alwal