స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏజెన్సీలో పెరుగుతున్న రాజకీయ సమీకరణలు.

0
3

వైఎస్సార్‌సీపీ లో చేరిన పేగ పంచాయతీ సురకుంట గ్రామానికి చెందిన 65 కుటుంబాలు……చింతూరు మండల పరిధిలోని పేగ పంచాయతీ సురకుంట గ్రామానికి చెందిన 65 కుటుంబాలు AVSP నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) లో చేరాయి. వైయస్సార్ పార్టీ సిద్ధాంతాలు, వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు అందించిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీటీసీ మరియు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు చిచ్చడి మురళి పార్టీలోకి వచ్చిన వారికి ఘనస్వాగతం పలికారు. సురకుంట గ్రామానికి చెందిన 65 కుటుంబాల సభ్యులకు ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిచ్చడి మురళి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో నిరంతరం ఆదరణ పెరుగుతోందని, కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో తొడం అర్జున్,జోగయ్య, రామ కృష్ణ,శ్రీరాములు, నూప కోటేశ్వరరావు , తొడం చంద్రయ్య ఆధ్వర్యంలో చేరారు.ఈ కార్యక్రమంలో చింతూరు మండల కన్వీనర్ వై రామ లింగా రెడ్డి, మాజీ ఎంపీపీ సవలం ఆమల, మేడిపల్లి సుధాకర్, కోట్ల కృష్ణ, sk. ఖాదర్ షరీఫ్, మడకం రమేష్,MD. కరీముల్లా,ఎడమ అర్జున్,పాయం చంద్రయ్య, సవలం సత్తిబాబు, కారం కన్నారావు , బి బాబురావు, పిసం పోదయ్య, సున్నం నాగరాజు,శ్యామల పిచ్చి రెడ్డి, శివయ్య, పీసం పొద్దయ్య, సోడే సీతయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri