అల్పపీడనం.. ఉత్తర కోస్తాకు తుఫాన్ ముప్పు

0
3

AP: ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 26వ తేదీ తర్వాత వాయుగుండంగా మారొచ్చని, 29 లేదా 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్గా తీరం దాటనుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు నేడు అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని SDMA తెలిపింది.