విజయదశమి పర్వదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
“ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన ఈ పవిత్రమైన రోజున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చేపట్టే పనుల్లో గొప్ప విజయాలు సాధించాలి” అని నారా లోకేశ్ ఆకాంక్షించారు.









