పోలీస్ అమరవీరులకు శంకర్ రాజు నివాళి.|

0
11

● ప్రజల రక్షణలో వీరుల ప్రాణత్యాగం చిరస్మరణీయం

● అమరుల కుటుంబాల త్యాగాలకూ గుర్తింపు అవసరం

● శాంతియుత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం కీలకం

అల్వాల్, 21 అక్టోబర్:విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సాహసాలు, సేవలు దేశానికి గర్వకారణమని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పేర్కొన్నారు.

పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు.

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారి తెగువ భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

అమరుల వెనుక ఎన్నో ఆశలతో కూడిన కుటుంబాలు ఉంటాయని, తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను సమాజం గుర్తించాలని శంకర్ రాజు అన్నారు. 

వీరుల ఆశయాలను ఆచరణలో పెట్టి, శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

#Sidhumaroju

Alwal