పలాస, అక్టోబరు 22:
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల రేసులో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ దువ్వాడ శ్రీజ గెలుపే లక్ష్యంగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీకాంత్ మరియు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
అనుభవం – నిబద్ధతతో కూడిన నాయకత్వం
గత 26 సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నామని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. పలాస-కాశీబుగ్గ పరిధిలోని ప్రతి వీధి, ప్రతి రోడ్డు, ప్రతి ఇల్లు మరియు కుటుంబ సభ్యులతో సుదీర్ఘమైన అనుబంధం ఉందని తెలిపారు. గతంలో శ్రీకాంత్ నాలుగుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా, శ్రీధర్ కౌన్సిలర్‌గా మరియు పీఏసీఎస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రశ్నించే గొంతుకగా ‘జెన్ జీ’ అభ్యర్థి శ్రీజ
నేటి యువత మరియు జెన్ జీ (Gen Z) తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ శ్రీజ, విద్యాధికురాలని, అన్యాయాలను మరియు అక్రమాలను ప్రశ్నించే స్వభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడే వ్యవస్థ పారదర్శకంగా మారుతుందని, పలాస మున్సిపాలిటీని మోడల్‌గా తీర్చిదిద్దడానికి శ్రీజ సరైన అభ్యర్థి అని స్పష్టం చేశారు.
కొబ్బరికాయ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి
పోటీలో ఉన్న డాక్టర్ దువ్వాడ శ్రీజకు కేటాయించిన “కొబ్బరికాయ” గుర్తుపై అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పలాస ప్రజలను, ఓటర్లను అభ్యర్థించారు.
ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ, మున్సిపాలిటీ పరిధిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తామంతా అండగా ఉంటామని, ఓటర్లు అధైర్యపడకుండా తమ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.










