
పలాస మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న దట్టి సౌందర్యను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్సార్సీపీ వార్డు ప్రతినిధి మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఉప్పరపేటలో పవర్ బోరు ఏర్పాటు, తాళభద్ర కాలనీలో సీసీ రోడ్లు నిర్మించామని గుర్తు చేశారు. తాళభద్ర బోర్డు స్కూల్ నుంచి లక్ష్మీనగర్ కాలనీ వరకు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టామని వివరించారు.
వార్డు మరింత సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే స్థానిక ప్రజలు, ఓటర్లు అండగా నిలిచి సౌందర్యను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. గ్రామ ప్రగతి కోసం వైఎస్సార్సీపీకి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.










