తెనాలి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది.మొత్తం 87 మంది నామినేషన్లలో 41 మంది ఉపసంహరణచేసుకోగ 46 మంది అభ్యర్థులు బరిలో నిల్చారు. 18 గ్రామాల్లో మొత్తం 21 స్థానాలకు గాను టిడిపి 11, జనసేన 10,వైఎస్సార్సీపీ 21, మందికి బీఫారాలు అందాయి. మిగిలిన నాలుగు స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారని రిటర్నింగ్ ఆఫీసర్ డి దుర్గాబాయి తెలిపారు.










