తెనాలి. మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటన.

0
1

తెనాలి మున్సిపల్ కమిషనర్ జే. అప్పలనాయుడు బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వరద నీరు నిల్వ ఉండకుండా డ్రైన్లతో  పూడికతీత పనులను పర్యవేక్షించారు. ప్రజల భద్రత కోసం రోడ్లపైకి వంగిన చెట్ల కొమ్మలను తొలగించే పనులను పరిశీలించారు. ముందస్తుగా ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు కమీషనర్, పేషీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.