దేశంలోని అన్ని ఎన్నికల్లో EVMలను ట్యాంపర్ చేశారని, బ్యాలెట్ విధానంలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని కాంగ్రెస్ ఇటీవల స్వరం పెంచింది. కానీ తాజాగా అదే పద్ధతిలో జరిగిన MLC ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడం BJPకి ఆయుధంగా మారింది. PM మోదీ సహా ఆ పార్టీ నేతలంతా సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎంలపై పోరులో ఇది పెద్ద ఎదురుదెబ్బేనని అంటున్నారు.










