బొబ్బిలి పట్టణంలోని 20వ వార్డులో పాత గోడ కుప్పకూలింది. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు గోడ నానిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్కూటీ, సైకిల్ మీద గోడ కూలడంతో అవి పూర్తిగా పాడైపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
#RAJESH










