తుఫాన్ ప్రభావంతో అమలకూడియా, పూర్ణభద్ర గ్రామాల్లో ఇబ్బందులు
తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి
పలాస, అక్టోబర్ 29: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అమలకూడియా గ్రామపంచాయతీ పరిధిలోని అమలకూడియా, పూర్ణభద్ర గ్రామాలు ముంపు గ్రామాలుగా (ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా) నమోదై ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈ గ్రామాల్లో గడ్డ పొంగిపొర్లుతుండగా, పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఈ పరిస్థితుల్లో తక్షణమే తగిన సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ, గ్రామ ప్రజల తరఫున తాజా మాజీ సర్పంచ్ కొర్ల శిరీష మురళీకృష్ణ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ముంపు గ్రామాలుగా నమోదైన ఈ రెండు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రాకపోకలను పునరుద్ధరించాలని, ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గడ్డ ప్రవాహం మరింత పెరిగితే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










