అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో అర్నబ్ తుఫాన్ వల్ల పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ, జిల్లా వనరుల కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం కొండంపూడి సంయుక్తంగా ఫీల్డ్ విజిట్ చేశారు.పాపంపేట, శరభవరం గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. జాగ్రత్తలు పాటిస్తే నష్టం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఏడీఏ టి శ్రీదేవి, వ్యవసాయ అధికారులు పి విజేత, ఎం విజయలక్ష్మి, డాక్టర్ సత్తిబాబు, డాక్టర్ ఎస్ఎంఎస్ కిషోర్, రోలుగుంట వ్యవసాయ అధికారి, బిటిఎం లక్ష్మి కిషోర్ పాల్గొన్నారు.










