తెనాలిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రారంభం

0
0

మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, తదితరు సామాగ్రిని అందజేశారు. సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని కమీషనర్ సూచించారు.