🔹గ్రామాల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి పిలుపు..!
🔸సైకిల్ గుర్తుపై ఓటేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించండి..!
కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాలెం, చిన్న అన్నలూరు సెగ్మెంట్ల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సుడిగాలి పర్యటన నిర్వహించి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలన సాగిస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి పోలు ఆది లక్ష్మమ్మ గారికి, తెల్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ బిజ్జం కృష్ణారెడ్డి గారికి, కృష్ణారెడ్డిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి తోకల యమున గారికి, చిన్న అన్నలూరు ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ ఏలూరి మహేంద్ర గారికి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
అదేవిధంగా కలిగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి మెట్టుకూరు శిరీష రెడ్డి గారిని సైతం సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఘన విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయా సెగ్మెంట్ల పరిధిలోని గ్రామాల్లో ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించడంతో పాటు తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో కలిగిరి మండలంలో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారనే ధీమాను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు వ్యక్తం చేశారు.










