*🔊న్యాయాధికారుల రిటైర్మెంట్ ఏజ్ 62 ఏళ్లకు పెంపు*
*🔶ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం*
🍥రాష్ట్రంలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ పెంపును 2026 మార్చి 31 నుంచి వర్తింపజేస్తూ తెలంగాణ పబ్లిక్ ఎంప్లా యిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరా న్యుయేషన్) చట్టం-1984లోని సెక్షన్ 3(1ఏ) కు సవరణలు చేసింది. తెలంగాణ స్టేట్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లకు చెందిన న్యాయాధికారులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుంది. ఈ సవరణను మార్చి 31,2026 నుంచి అమల్లోకి తీ సుకొస్తున్నట్లు ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. న్యాయా ధికారుల పదవీ విరమణ వయసు పెంపుపై సు ప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2026 ఆగస్టు 19న పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని హైకోర్టు ఫుల్ కోర్టు సిఫార్సు చేసింది.
భారత్ అవాజ్
మిర్యాలగూడా










