మేడ్చల్లోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం.

0
2

మేడ్చల్‌ పారిశ్రామిక వాడలోన ఉన్న ఫ్రేమ్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా అగ్నిమాపక అధికారి తెలిపారు. పరిశ్రమలో ఎంతమేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు కూడా ప్రస్తుతానికి వెల్లడికాలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.