క్రమశిక్షణే పోలీసుల బలం.. అంబర్‌పేటలో వీక్లీ పరేడ్.|

0
1

● పరేడ్‌ను సమీక్షించిన మల్కాజిగిరి డీసీపీ చి. శ్రీధర్, ఐపీఎస్

● శారీరక దారుఢ్యం, బృంద సమన్వయంపై ప్రత్యేక దృష్టి

● ప్రజల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచన

అల్వాల్,నవంబర్7:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్‌పేటలోని CAR హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి డీసీపీ, శ్రీధర్, ఐపీఎస్ పరేడ్ రివ్యూ అధికారిగా హాజరై పోలీసు సిబ్బంది పరేడ్‌ను సమీక్షించారు.

పోలీసు విధుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, బృంద సమన్వయం, అప్రమత్తత ఎంతో కీలకమని ఈ పరేడ్ ద్వారా చాటిచెప్పారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధి నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పోలీసు సిబ్బంది తమ క్రమశిక్షణను ప్రదర్శించారు.

#Sidhumaroju

Alwal