పత్తివ్యాపారుల సిండికేట్!ఉమ్మడి జిల్లాలో మొదలైన కొనుగోళ్లు సీసీఐ కేంద్రాలు తెరిచినా ఆసక్తి చూపని రైతులు
తేమ పేరిట కోత పెడుతున్న ప్రైవేట్ వ్యాపారులుడం.దిగుబడి తగ్గడం ఫుల్ డిమాండ్ధ తగ్గిస్తున్నా పట్టించుకోని అధికారులులు నష్టపోతున్న తెల్లబంగారం రైతులు…
భరత్ ఆవాజ్ న్యూస్ :- వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈయేడు. 5లక్షల ఎకరాలకుపైగా పత్తిని సాగు చేశారు. సాగు పెరిగిన, ధర ఉన్న ఈ యేడు రైతులకు కలిసిరా లేదు. ఎల్న్ని ఎఫెక్ట్, వర్షాలు లేకపోవడం పత్తి సాగుపై భారీ ప్రభావాన్ని చూపింది. పత్తికి గులాబీ తెగుళ్లు రావడం కూడా మరింత నష్టాన్ని కలిగిం చింది. వర్షాభావ ప్రభావం, ఎల్నినో ఎఫెక్ట్ తో తగి నంతగా దిగుబడి రావడం లేదు. ప్రతీ సంవత్సరం ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా ఈయేడు సరాసరి సగటున 5 క్వింటాళ్ల వరకు రావడమే గగనంగా మారింది. కొద్దిమంది రైతులను మినహాయిస్తే ఎక్కువ మంది రైతులకు 4 నుంచి 6 క్వింటాళ్ల మధ్యనే దిగుబడి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో పంట విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ లో ధర ఉండటం, పెట్టుబడి భారీగా పెరగడం, దిగుబడి రాకపోవడంతో నష్టం వస్తుందని ఆందోళన చెందు తున్నారు. తేమ పేరిట కోతలు..ఉమ్మడి జిల్లాలో పత్తిసాగు పెరిగినా వర్షాభావ పరి స్థితులతో దిగుబడి రాకపోవడం, వచ్చిన పత్తికి ధర వస్తున్నా మార్కెట్ లో వ్యాపారులు ఇష్టారీతిన వ్యవ హరించడంతో రైతులకు నష్టం జరుగుతుంది. మద్ద తు ధరకు మించి ధర పెడుతున్నా తూకం తర్వాత తేమ, ఇతర కారణాలు చెప్పి క్వింటాలుకు రూ.300 నుంచి రూ.500 వరకు ధర తగ్గిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు మద్దతు ధర కన్న తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు 8,667 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించింది. మార్కెట్ లో సరాసరి రూ.5500 నుంచి రూ.9వేల మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. తేమ ఎక్కువగా ఉన్న పత్తికి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తేమ తక్కువగా ఉన్న పత్తికి నిబంధనల మేరకు మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్ ఎనుమాముల మార్కెట్, కేసముద్రం, మహబూబాబాద్, నర్సంపే ట, ములుగు, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, నెక్కొండ ఏ మార్కెట్ ను చూసిన ధర ఇదే విధంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. మద్దతు ధరకు మించి వ్యాపారులు ధర పెడుతుండటంతో ఎక్కువ మంది రైతులు వారికే అమ్మకాలు చేస్తున్నారు. సీసీఐకి అమ్మాలంటే కిసాన్ కపాస్ ద్వారా ముందు స్లాట్ బుక్ చేసుకొని అమ్మ కాలు చేయాల్సి ఉండటంతో రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. ధర తగ్గితే సీసీఐకి అమ్మే అవకాశం ఉండటంతో వ్యాపారులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. మార్కెట్, జిన్నింగ్ మిల్లులకు వస్తున్న పత్తిని మొదట మద్దతు ధరకు మించి ధరలు పెడుతున్నారు. ధర ఖరారైన తర్వాత అన్ని బస్తాలను పరిశీలించి కొంత మేర తగ్గిస్తు న్నారు. రైతులనుబట్టి క్వింటాలుకు రూ.500 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మార్కెట్ లో ఈ వ్యవహారాలన్నీ పరిశీలించాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అమ్మకాలను పర్య వేక్షిస్తూ క్రయ విక్రయాలు జరిగే విధంగా చూస్తున్నారు. పత్తికి జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. ఏ రాష్ట్రంలో చూసిన సాగు ఎక్కువగా కాలేదు. సాగు చేసిన పత్తికి దిగుబడి రావడం లేదు. డిమాండ్ ఉండి దిగుబడి లేకపోవడం, పెట్టుబడి పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో మరింత ధర పెట్టి కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు. రైతు సంఘాల నేతలు కూడా తరుగు తగ్గకుండా చూడాలని కోరుతున్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో పత్తి క్రయ విక్రయాలు సక్రమంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ధర తక్కువగా వస్తే సీసీఐకి అమ్మకాలు చేయాలని ఆయన కోరారు. పత్తి డిమాండ్ ఉండి దిగుబడి తగ్గిన సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేలు జరిగే అవకాశం ఉంది.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము










