● గురుస్వామి పొల్లం నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
● భక్తిశ్రద్ధలతో అయ్యప్ప దీక్ష స్వీకరించిన ఎమ్మెల్యే
● ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం స్వామివారిని వేడుకున్న శ్రీగణేష్
అల్వాల్, నవంబర్ 12: బొల్లారంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ చేశారు. గురుస్వామి పొల్లం నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురుస్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే శ్రీగణేష్ మాల స్వీకరించి అయ్యప్ప దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ప్రార్థించారు. అయ్యప్ప దీక్షలో పాటించే నియమ నిష్ఠలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిసాల బజారుకు చెందిన పి. సాయి యాదవ్, పి. బబ్లు యాదవ్, పి. హరీష్ యాదవ్, టి. ప్రసాద్ యాదవ్, పి. ఆశిష్ యాదవ్, ఎల్. సాయినాథ్ యాదవ్, సీతారాం రెడ్డి, శైలేష్, వంశీ, కేశవ్ తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
#Sidhumaroju
Alwal










