నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించరాదు: మోపాల్ SI సుస్మిత గారు.

0
1

మోపాల్ మండల్ 

 

ట్రాక్టర్లు, ట్రాలీలలో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఇతర సామగ్రిని తరలించేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోపాల్ SI సుస్మిత సూచించారు.

 

కంజర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ హెచ్చరిక చేశారు.

 

ఓవర్ లోడ్ తో, నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించి, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు.👍

ఇదే విషయం ముందుగా అలోచించిన కులస్పూర్ గ్రామ యువత సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారికి, వినతి పత్రం ఇచ్చినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు, 16 రోజుల ముందే, గ్రామ యువత, దేనిగురించి ఆలోచించి, వినతి పత్రం ఇచ్చినా 🤔🤔ఎలాంటి చర్య తీస్కొనందుకు, ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది, చిన్న పనులను చేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళు, ఇలాంటి ప్రమాదం లొ ప్రాణాలు పోతో ఎవరు బాధ్యత 🤔🤔

కులస్పూర్ గ్రామ యువత కు ప్రతి ఒక్కరి తరపున 🙏🙏🙏🙏 నమస్కారం ❤️❤️❤️

ఇదీ కులస్పూర్ గ్రామ యువత ఇచ్చిన వినతి పత్రం,

https://ba.bharataawaz.com/posts/24792