మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన ముక్తి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదేశాల మేరకు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు, మాలోత్ నరసింహారావు (స్వామి), యువజన నాయకులు రామిశెట్టి వంశీ, రావుట్ల నరేష్ చారి, వాంకుడోత్ బాబులాల్, గ్రామ నాయకులు జబ్బా రామనాధం, వట్టం ప్రసాద్, జబ్బా నాగరాజు, జబ్బా నారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










