కస్తూరిబా పాఠశాలలో సందడిగా చిల్డ్రన్స్ డే వేడుకలు

0
2

రోలుగుంట కస్తూరిబా గాంధీ పాఠశాలలో బాలల దినోత్సవం సందడిగా సాగింది. ప్రిన్సిపల్ తులసి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ జీవిత చరిత్రపై డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పాటలు, నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చివరగా విద్యార్థులకు మిఠాయిలు పంచి వేడుకను ముగించారు.