శ్రీ సత్యసాయి విద్యావిహార్‌లో నాగులచవితి శోభ

0
0

విద్యార్థుల సామూహిక పుట్ట పూజలు

రామక్రిష్ణపురం: నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రామక్రిష్ణపురంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు బ్రహ్మముహూర్తంలోనే లేచి తలంటు స్నానాలు చేసి, నిత్య ఓంకార సుప్రభాత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం విద్యార్థులంతా సామూహికంగా భక్తిశ్రద్ధలతో పుట్ట వద్దకు చేరుకున్నారు. నాగేంద్రునికి చిమ్మిలి, చలివిడి, ఆవుపాలు సమర్పించి, పూజా సామగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వార్డెన్లు చంద్రశేఖర్, జీవన్, బలరాం, అనిత, మౌనిక, మమత, ఉపాధ్యాయులు లావణ్యకృష్ణ, ప్రవీణ, దాలేటి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యతో పాటు సనాతన ధర్మాన్ని సంరక్షించడమే తమ సంస్థ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రీతి చౌదరి మాట్లాడుతూ, ఆధునిక విద్యతో సమానంగా ఆధ్యాత్మిక విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు.