హైదరాబాద్ లోని ఆటో రిక్షా కార్మికుల సొంతింటి కలకు ప్రభుత్వ ఆమోదం.

0
3

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నివసించే ఆటో రిక్షా కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి కోసం ఆటో నగర్ కాలనీ పేరుతో ప్రత్యేక ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మొదటి విడతలో ₹220 కోట్ల అంచనా వ్యయంతో 2000 ఫ్లాట్ లను నిర్మించనున్నారు. ఈ పథకం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి 4 ప్రధాన దిక్కుల్లో ఒక్కొక్క చోట సుమారుగా 500 ప్లాట్ ల నిర్మాణం చేపట్టనునట్టు సమాచారం. బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీరాబాద్, జల్పల్లి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్టు సమాచారం. నగరంలో నిత్యం కష్టపడుతూ జీవితాన్ని భారంగా నడుపుతూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ లకు ఈ పథకం భద్రతతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించనున్నాయి.