పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా ఎస్పీ నితికా పంత్

0
2

🎤కుమరంభీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచడం ద్వారా నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలైన గంజాయి, మట్కా, బెట్టింగ్ మరియు జూదంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.