ఉప్పల్‌లో జన్మదిన వేడుకల సందర్భంగా

0
0

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు వేడుకలు నిర్వహించారు.

హబ్సిగూడ మీదుగా ఉప్పల్ రింగ్ రోడ్డుకు చేరుకున్న ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారు.

అనంతరం నల్లచెరువు వద్ద వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే పాదయాత్రగా బయలుదేరగా, ఉప్పల్ వెజిటబుల్ మార్కెట్ సమీపంలోని హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు.