Home South Zone Telangana సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది...

సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.

0

సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు

 

అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్, మచ్చబొల్లారం రోడ్ నెంబర్ 10, సాయి రెడ్డి కాలనీలో గత వారం రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రివేళల్లో రోడ్లపై చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి.కాలనీలోని మహిళలు, విద్యార్థులు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారు.చీకటి కారణంగా దొంగతనాలు,  అసాంఘిక సంఘటనలు జరిగే అవకాశం ఉందని కాలనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు మరమ్మతు చేయాలని పలుమార్లు విద్యుత్  అధికారులకు, లైన్ మెన్ లకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీ ప్రజలు త్వరితగతిన సమస్యను పరిష్కరించి వీధి దీపాలను సరిచేయాలని జిహెచ్ఎంసి మరియు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

   -సిద్దుమారోజు 

Exit mobile version