South ZoneTelangana ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి By Bharat Aawaz - 31 July 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఎస్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారందరికీ ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తారు. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా… రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. డీఎస్ఈ- ఎస్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు తీసుకుంటారు.