మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఏ వ్యవస్థ అయినా సాఫీగా సాగాలంటే పోలీసుల పాత్ర కీలకం. ప్రజలను నిరంతరం కాపాడుతూ వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. ఈరోజు అమరవీరుల సంస్మరణదినోత్సవం పురస్కరించుకొని అల్వాల్ పోలీసులు అమరులైన తమ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం.. ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడేవారు సైనికుల అయితే, ప్రజలను కాపాడేది పోలీసులు అన్నారు. శాంతి పరిరక్షణ బాధ్యులతోపాటు, ట్రాఫిక్ సమస్యలు, హింసాత్మక సంఘటనలు వంటి ఎన్నో రకాల సమస్యలను పరిరక్షిస్తూ నిరంతరం ప్రజలకు సేవలు అందించేది పోలీసులేనని వివరించారు. శాంతి భద్రతలను నిరంతరం పరిరక్షిస్తూ, అసాంఘిక శక్తులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందిస్తున్న తమ పోలీస్ బృందాన్ని అభినందించారు. యూనిఫామ్ ధరించిన ప్రతి పోలీస్ మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో తమ జీవితాలను అంకితం చేసి అమరులైన పోలీసులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Sidhumaroju