Home South Zone Telangana లోకల్‌తనమే శాపం.. విద్యార్థుల కలల బలి |

లోకల్‌తనమే శాపం.. విద్యార్థుల కలల బలి |

0

తెలంగాణకు చెందిన 26 మంది విద్యార్థులు ఇంటర్‌మెడియట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా మెడికల్ సీట్లకు దూరమవుతున్నారు.

జీవో 33 ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివినవారికే లోకల్ హోదా వర్తిస్తుంది. దీంతో ఈ విద్యార్థులు అటు ఏపీకి, ఇటు తెలంగాణకు చెందని పరిస్థితిలో చిక్కుకుపోయారు.

తమను జీవో 144 పరిధిలోకి తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్య మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఈ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

NO COMMENTS

Exit mobile version