Home South Zone Telangana ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0

సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో ఉన్న భారీ గుట్ట రాళ్ళు పగుళ్ళు ఏర్పడి ఏ క్షణమైనా పడి పోయేలా ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆ ప్రాంత వాసులతో కలసి ఆ ప్రాంతాన్ని,గుట్ట రాళ్ళను పరిశీలించారు.అక్కడినుండే GHMC అధికారులతో మాట్లాడి తక్షణమే యుద్ధప్రాతిపదికన గుట్ట రాళ్ళను తొలగించి పరిసర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ జరుగకుండా చూడాలని చెప్పారు.

స్థానిక ప్రజలకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి ఇబ్బంది జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని, ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ధనలక్ష్మి,వెంకట స్వామి, శంకర్ ,ముత్యాలు, రాములు తదితరులు ఉన్నారు.

Sidhumaroju

NO COMMENTS

Exit mobile version