ఫోన్‌ను ఛార్జ్ చేసేప్పుడు కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌ను ఉపయోగించడం అత్యంత మంచిది. నాసిరకం ఛార్జర్లు వాడితే ఫోన్ లేదా ఛార్జర్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. కంపెనీ ఛార్జర్లు కఠిన పరీక్షలు పూర్తి చేసి మార్కెట్‌లోకి వస్తాయి కాబట్టి అవి సురక్షితం.
లిథియం-అయాన్ బ్యాటరీలున్న ఫోన్లలో తక్కువ సేపు, ఎక్కువసార్లు ఛార్జ్ చేసినా సమస్య లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఛార్జర్లు వాడితే 100% వరకు ఛార్జ్ చేయకుండా ఉండాలి. బ్యాటరీ 20%కు చేరినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతూ పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
