Home South Zone Telangana జాగృతి జనం బాట – పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|

జాగృతి జనం బాట – పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|

0

సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరారు.

శాతవాహన ఎక్స్ప్రెస్ ద్వారా సాధారణ ప్రయాణికులతో కలిసి ఆమె రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా కవితను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు పోటీ పడడంతో రైల్వే స్టేషన్ లో కోలాహలం నెలకొంది.

రైల్లో కూర్చున్న ఆమెతో మహిళలు అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఖమ్మంలో జరగబోయే జాగృతి జనం బాట కార్యక్రమానికి ఆమె రైల్లో సాధారణ ప్రయాణికులతో ప్రయాణించడం, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగిందని జాగృతి వర్గాలు తెలిపాయి.

Sidhumaroju

Exit mobile version