AIIMS Delhi CRE Recruitment 2025 కింద దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్ మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 1,383 గ్రూప్-B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్టోర్స్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్, స్టెనో, రేడియాలజీ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి.
అర్హతగా 10వ తరగతి నుంచి పీజీ వరకు సంబంధిత విద్యార్హతలు, అనుభవం అవసరం. వయోపరిమితి 18–30 ఏళ్లు. జనరల్/ఓబీసీ ఫీజు ₹3000, ఎస్సీ/ఎస్టీ/EWS ఫీజు ₹2400. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 2, 2025.
