తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయకూడదని స్పీకర్‌కు తుది గడువుగా నాలుగు వారాలు ఇచ్చింది.
ఈ వ్యవధిలోగా తుది నిర్ణయాన్ని ప్రకటించాలని, లేనిపక్షంలో ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. జూలై 31లోపు నిర్ణయం ఇవ్వాలన్న పూర్వ ఆదేశాలను అమలు చేయలేదని బీఆర్ఎస్ ధిక్కార పిటిషన్లు దాఖలు చేసింది.
సమగ్ర విచారణకు మరికొంత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరగా, ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత మరో నాలుగు వారాల గడువును మంజూరు చేసింది.
